Header Banner

బీసీలే టీడీపీకి వెన్నెముక.. అభివృద్ధికి అహర్నిశలు కృషి! సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

  Fri Apr 11, 2025 15:02        Politics

నూజివీడు ప్రజావేదికలో జరిగిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, బీసీలకు అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని తెలిపారు. టీడీపీకి బీసీలు మొదటినుంచీ వెన్నెముకగా ఉన్నారని, వారి అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తామన్నారు. మోదీ, పవన్ కలసి తాను వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి పనిచేస్తున్నామని తెలిపారు. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీ కులాలకు మేలు చేస్తున్నామన్నారు. ఎన్టీఆర్ హయాంలో బీసీలకు గురుకుల పాఠశాలలు వచ్చాయని, మత్స్యకార కుటుంబాల కోసం 9 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి రూ.15 లక్షల సాయం, సివిల్స్, గ్రూప్స్ పరీక్షలకు కోచింగ్, అమరావతిలో కోచింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. బ్యాచ్‌కి 500 మందికి కోచింగ్ ఇస్తామని వివరించారు.

“ఆదరణ-3” కింద ఏటా రూ.వెయ్యి కోట్లను ఖర్చు చేస్తున్నామని, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. నేతన్నలకు ఉచితంగా విద్యుత్, వెనుకబడిన వర్గాలకు ఇల్లు కట్టుకునేందుకు అదనంగా రూ.50 వేలు, ఎస్సీల ఇంటిపై ఉచిత సోలార్ ప్యానెల్స్ ఇస్తున్నామన్నారు. నూజివీడు నియోజకవర్గ అభివృద్ధికి పార్థసారథిని కోరినట్టు తెలిపారు. అప్పులు చేసి అవినీతి చేస్తే సమాజం మనుగడ కోల్పోతుందని హెచ్చరించారు. ఖజానాలో డబ్బులేనప్పటికీ అభివృద్ధి పనులు చేపడతామని, తాను చేసిన పనులు చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు.


ఇది కూడా చదవండి: ఏపీ మంత్రులకు చంద్రబాబు మార్క్ షాక్! తొలిగింపు లిస్టులో నెక్స్ట్ వారే.!


దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టామన్నారు. రూ.64 లక్షల మందికి పింఛన్లు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి రూ.10 వేల నుంచి రూ.15 వేలు ఇవ్వడం, మహిళలు డ్వాక్రా సంఘాల ద్వారా స్వయంప్రతిపత్తి సాధించగలిగారని చెప్పారు. “ప్రతి ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటానన్న మాట నిలబెట్టుకున్నాను” అని సీఎం అన్నారు. ప్రజలు తనపై విశ్వాసంతో ఓటు వేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. 93 శాతం అభ్యర్థులను గెలిపించారని, అది చరిత్రలో ఎన్నడూ చూడని విజయం అన్నారు.

సోషల్ మీడియా గురించి మాట్లాడుతూ, కొందరు సైకోలు రెచ్చిపోతున్నారని, ఆడబిడ్డలపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని, ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెడితే అదే వారి చివరి రోజు అవుతుందన్నారు. స్వేచ్ఛ ఇచ్చినదే తప్ప… రౌడీల్లా ప్రవర్తిస్తే కఠినంగా వ్యవహరిస్తానని, తప్పులు చేస్తే చండశాసనుడిగా ప్రవర్తిస్తానని హెచ్చరించారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సచివాలయ ఉద్యోగులపై తాజా నిర్ణయం.. నియామక బాధ్యతలు వారీకే! ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ!


రేషన్ కార్డు EKYC పూర్తి చేసుకున్నారా! లేకపోతే అవి రావు! త్వరగా ఇలా చెక్ చేసుకోండి!


పేదల కలలు నెరవేర్చిన లోకేష్.. 1,030 మందికి శాశ్వత ఇంటిపట్టాలు! 5వ రోజు "మన ఇల్లు" కార్యక్రమం!


పోలీసులపై జగన్ వ్యాఖ్యలు హేయం.. క్షమాపణ చెప్పాలి! బీజేపీ అధ్యక్షురాలు ఆగ్రహం!


వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi